ధనుశ్ కొత్త సినిమా నుంచి ఫస్టులుక్ వచ్చేస్తోంది

  • కార్తీక్ సుబ్బరాజ్ నుంచి 'సురులి'
  • గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్న ధనుశ్
  • నాయికలుగా సంచనా నటరాజన్ .. ఐశ్వర్య లక్ష్మి 
ధనుశ్ కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ 'సురులి' అనే ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో వైనాట్ స్టూడియోస్ .. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ గా ఈ సినిమాలో ధనుశ్ కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొదలైన దగ్గర నుంచి నాన్ స్టాప్ గా చిత్రీకరణ జరుపుకుంటోంది.

ఈ నెల 19వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను .. మోషన్ పోస్టర్ ను విడుదల చేయనున్నారు. ధనుశ్ కి తమిళంతో పాటు తెలుగులోను మంచి ఫాలోయింగ్ వుంది. అందువలన తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఫస్టులుక్ ను .. మోషన్ పోస్టర్ ను కూడా తమిళంతో పాటు తెలుగులో విడుదల చేయనున్నారు. ధనుశ్ సరసన కథానాయికలుగా సంచనా నటరాజన్ .. ఐశ్వర్య లక్ష్మి కనిపించనున్నారు.
Go Back to Shorts
Dhanush
Sanchana Natarajan
Aishwarya Lakshmi

More Telugu News